
Published : 04 Aug 2020 00:53 IST
దోచుకోవడానికే విశాఖలో రాజధాని: అయ్యన్న
అమరావతి: రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉంటే.. సీఎం జగన్ మూడు ముక్కలాట ఆడుతారా? అని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఏపీలో మూడు రాజధానుల విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 29వేల రైతు కుటుంబాలకు అన్యాయం జరిగితే పట్టించుకోరా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దోచుకోవడానికే విశాఖలో రాజధానిని పెట్టారని ఆరోపించారు. ఇప్పటికే ఆరు వేల ఎకరాలు కాజేశారని, ధరలు పెంచి అమ్మేందుకు చూస్తున్నారని విమర్శించారు.
Tags :