UP Assembly  Polls: నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: అఖిలేశ్ యాదవ్

సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ  ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు. మరోసారి సీఎం పీఠాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోన్న ఈ మాజీ ముఖ్యమంత్రి నుంచి వచ్చిన మాటలు ఆశ్చర్యపరుస్తున్నాయి. 

Updated : 01 Nov 2021 15:40 IST

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ  ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు. మరోసారి సీఎం పీఠాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోన్న ఈ మాజీ ముఖ్యమంత్రి నుంచి వచ్చిన మాటలు ఆశ్చర్యపరుస్తున్నాయి.

అఖిలేశ్ అజంగఢ్‌ స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఎస్పీ గెలుపొందింతే ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోనున్నారు. ప్రస్తుతం ఆయన పోటీ చేయకపోయినా.. ఈ ఎన్నికల్లో ఎస్పీ గట్టి పోటీ ఇవ్వనుంది. మరోపక్క  రాష్ట్రంలోని ఇతర ప్రాంతీయ పార్టీలతో ఎస్పీ పొత్తులు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్‌డీ)తో తమ పొత్తు ఖరారైందని అఖిలేశ్‌ వెల్లడించారు. సీట్ల సర్దుబాటు గురించి చర్చిస్తున్నామని ఓ మీడియా సంస్థతో అన్నారు. అలాగే తన బాబాయ్ శివపాల్ యాదవ్ పార్టీ ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ లోహియా(పీఎస్‌పీఎల్‌)తో పొత్తు గురించి మాట్లాడుతూ..‘ ఆ పార్టీతో కలిసి వెళ్లే విషయంలో నాకు ఎలాంటి సమస్యా లేదు. ఆయన, ఆయన సభ్యులకు తగిన గౌరవం దక్కుతుంది’ అని తెలిపారు.

అఖిలేశ్‌ 2012 నుంచి 2017 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీని ఓడించి భాజపా భారీ విజయాన్ని దక్కించుకుంది. భాజపా 312 సీట్లు గెలవగా.. ఎస్పీ 47 స్థానాలకే పరిమితమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని