Revanth reddy: అందువల్లే నాకు పీసీసీ పదవి వచ్చింది: రేవంత్‌రెడ్డి

కొంపల్లిలోని పీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్లో బోధన్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..

Updated : 12 Oct 2022 15:38 IST

హైదరాబాద్‌: కొంపల్లిలోని పీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్లో బోధన్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి క్రీయాశీల పాత్ర పోషించారని తెలిపారు. ‘‘రాజీవ్‌ రైతు దీక్ష పేరుతో నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన సభ విజయవంతం కావడం దిల్లీ కాంగ్రెస్‌కు చేరింది. అందువల్లే నాకు టీపీసీసీ పదవి వచ్చింది. మూతపడ్డ నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని తెరాస హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదు. కేసీఆర్‌ ఓసారి ఎమ్మెల్యేగా, సింగిల్‌ విండో డైరెక్టర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. అబద్ధాలు చెప్పి నిజామాబాద్‌లో గెలిచిన కవిత హామీలు నిలబెట్టుకోకపోవడంతో రైతులు నామినేషన్‌ వేసి ఓడగొట్టారు. ఎంపీ అరవింద్‌ పసుపు బోర్డు తెస్తానని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్‌ దళితబంధు పేరుతో ప్రశ్నిస్తుంటే.. కేసీఆర్‌ ఓడిపోతారనే భయంతో తిరిగి తెలంగాణ, ఆంధ్రా ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. త్వరలో గజ్వేల్‌, నిజామాబాద్‌లో భారీ సభ ఏర్పాటు చేస్తాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని