Ap News: ఓటీఎస్‌ నచ్చితేనే ఇల్లు రిజిస్ట్రేషన్‌: బొత్స సత్యనారాయణ

పేదలకు సొంతింటిపై పూర్తి హక్కుల కల్పనే వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) ముఖ్య ఉద్దేశం అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం హయాంలో పేదల ఇళ్లకు ఎందుకని రిజిస్ట్రేషన్లు చేయలేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఓటీఎస్‌పై ప్రజలకు అవగాహన...

Updated : 07 Dec 2021 12:40 IST

అమరావతి‌: పేదలకు సొంతింటిపై పూర్తి హక్కుల కల్పనే వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) ముఖ్య ఉద్దేశం అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం హయాంలో పేదల ఇళ్లకు ఎందుకని రిజిస్ట్రేషన్లు చేయలేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఓటీఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరితే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటీఎస్‌ నచ్చితేనే ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని.. ఇది పూర్తిగా ప్రజల ఇష్టానికే వదిలేశామన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటీఎస్‌ కింద ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఈ నెల 28తో ముగియనుండగా.. గడువును పెంచాలని అనేకమంది కోరుతున్నారని చెప్పారు. ప్రజల విజ్ఞప్తులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని