TS News: దిశ కమిటీ అధికారులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్ జిల్లా దిశ కమిటీ సమావేశానికి కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరు కాకపోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 25 Nov 2021 17:15 IST

హైదరాబాద్‌: హైదరాబాద్ జిల్లా దిశ కమిటీ సమావేశానికి కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరు కాకపోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించే క్రమంలో సమాధానం చెప్పే అధికారులు లేకపోవడంతో సమావేశం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. వారు రాకపోతే చర్చ జరగదని కిషన్‌రెడ్డి చెప్పడంతో కలెక్టర్‌ భేటీకి హాజరయ్యారు.

స్వనిధి యోజన పథకాన్ని హైదరాబాద్‌లో అధికారులు బాగా అమలు చేయాలని కిషన్‌రెడ్డి అధికారులకు సూచించారు. వీధి వ్యాపారులుగా గుర్తింపుకార్డు ఇవ్వడంలో అలస్యమవుతుందని దాన్ని అధిగమించాలన్నారు. పథకాలు అమలు చేస్తున్నప్పుడు తలెత్తే సమస్యలను అధికారులు గుర్తించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సి్న్‌ అందరికీ అందించేందుకు అధికారులు కృషి చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. రాజకీయ పార్టీలు మహిళా సంఘాల సహకారంతో బస్తీల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. బస్తీ దవాఖానాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని