Chandrababu: వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాలి : చంద్రబాబు

వరదల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Updated : 28 Nov 2021 15:48 IST

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి

అమరావతి : వరదల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎస్‌ సమీర్‌శర్మకు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లిందని తేలితే.. కేవలం రూ.35 కోట్లు విడుదల చేయడం సరికాదన్నారు.. ప్రకృతి వైపరీత్యాల  నిధులనూ దారి మళ్లించినట్లు కాగ్‌ తప్పుబట్టినట్లు పేర్కొన్నారు.

‘ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. తుమ్మలగుంట చెరువును ఆటస్థలంగా మార్చారు. చెరువును ఆటస్థలంగా మార్చడంతో తిరుపతిని వరదలు ముంచెత్తాయి. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై న్యాయ విచారణ జరిపించాలి. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. రోడ్లు, వంతెనలు, విద్యుత్‌ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ బాధితులు తిండి, వసతి లేక రోడ్ల మీదే ఉండి ఇబ్బందులు పడుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు.. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలి’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని