
Updated : 20 Nov 2021 17:22 IST
AP News: వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరలో పర్యటిస్తా: చంద్రబాబు
అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో తర్వలోనే పర్యటించనున్నట్టు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. వరద ప్రాంతాల్లోని పరిస్థితులపై ఆయన పార్టీ నేతలతో సమీక్షించారు. వరద బాధితులకు తెదేపా శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బాధితులకు ఆహారం, మందులు, చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్, ఐటీడీపీ ద్వారా ఇప్పటికే ఆహారం, మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. తెదేపా శ్రేణులు ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టాయన్నారు.
Advertisement
Tags :