CM Kcr: దిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌ ... ప్రధాని మోదీని కలిసే అవకాశం

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, అధికారులు దిల్లీ చేరుకున్నారు. 3..4 రోజులు హస్తినలోనే ఉండనున్నారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై ప్రధాని మోదీని కలిసే అవకాశముంది.

Updated : 22 Nov 2021 04:49 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, అధికారులు దిల్లీ చేరుకున్నారు. 3..4 రోజులు హస్తినలోనే ఉండనున్నారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై ప్రధాని మోదీని కలిసే అవకాశముంది. వరి ధాన్యం కొనుగోళ్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలు  తేల్చాలని సీఎం కోరనున్నారు. వరి ధాన్యం ఎంత కొంటారో వార్షిక లక్ష్యం చెబితే .. రాష్ట్ర రైతులకు మార్గనిర్దేశనం చేసేలా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోనుంది. దిల్లీ పర్యటనలో కేంద్రం స్పందన మేరకు  యాసంగి పంటలపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కోరనున్నారు. కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటుపైనా చర్చలు జరపనున్నారు. గిరిజన రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ కేంద్రం తేల్చడం లేదు. ఎస్సీ వర్గీకరణపైనా తేల్చాలని కోరనున్నారు. బీసీ కులగణనపైనా చర్చించే అవకాశముంది. సీఎం వెంట మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌,  సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ , అధికారులు వెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని