Votes Counting: తడిచిన బ్యాలెట్ల వాలిడేషన్‌పై నిర్ణయం రిటర్నింగ్‌ అధికారులదే: ద్వివేది

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతం జరుగుతోందని ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ

Updated : 19 Sep 2021 15:48 IST

అమరావతి: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతం జరుగుతోందని ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోందని తెలిపారు. పలు కారణాలతో 6 చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయన్నారు. రెండు చోట్ల చెదలు పట్టగా, మరో 4 చోట్ల తడిచిపోయాయని చెప్పారు. తడిచిన, చెదలు పట్టిన బ్యాలెట్‌ పేపర్ల వాలిడేషన్‌పై కలెక్టర్లు, రిటర్నింగ్‌ అధికారులే నిర్ణయం తీసుకుంటారన్నారు. రీపోల్‌ అవసరమనుకుంటే ఎస్‌ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుందని ద్వివేది స్పష్టం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు త్వరగానే వస్తాయని.. జడ్పీటీసీ ఫలితాలు వచ్చేందుకు సాయంత్రం, రాత్రి వరకు సమయం పడుతుందన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని