
Jagga Reddy: రేపు చంద్రబాబు గెలిస్తే.. నీ పరిస్థితేంటి జగన్?
చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం ఇబ్బందిగా అనిపించిందన్న జగ్గారెడ్డి
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో నిన్న చోటుచేసుకున్న ఘటనలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జగన్ టీం చేసిన అవమానాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబును ఓసారి వైఎస్ ఒకమాట అని.. రికార్డుల నుంచి తొలగించాలన్నారని గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో దూషణలు చూడలేదన్న జగ్గారెడ్డి.. ఆయన కన్నీరు పెట్టుకోవడం తనకు ఇబ్బందిగా అనిపించిందన్నారు. ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు మరిచిపోయి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరైన సంప్రదాయం కాదన్నారు.
పదవులు ఎవరికీ శాశ్వతం కాదని,.. రాజకీయాల్లో విలువలను పరిరక్షించాలన్నారు. వైకాపా నేతల ప్రవర్తన సమాజానికి చెడు సంకేతాలను పంపిస్తోందని హితబోధ చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేననీ.. పార్టీకి ఎలాంటి సంబంధంలేదని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో బాబు గెలిస్తే.. నీ పరిస్థితి ఏంటి జగన్? అని ప్రశ్నించారు. ఏపీలో ప్రజాస్వామ్యంలేని పాలన ఉన్నట్టు అనిపిస్తోందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి
Advertisement