Nara Rohit: మా పెద్దమ్మపై లేనిపోని నిందలు మోపడానికి నోరెలా వచ్చిందో!: నారా రోహిత్‌

చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో తెదేపా అధినేత చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత నారా ఖర్జూరనాయుడు, అమ్మణమ్మ

Updated : 21 Nov 2021 12:05 IST

పూర్వీకుల సమాధుల వద్ద బైఠాయించి నిరసన తెలిపిన నటుడు

నారావారిపల్లె: చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో తెదేపా అధినేత చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత నారా ఖర్జూరనాయుడు, అమ్మణమ్మ సమాధుల వద్ద సినీనటుడు నారా రోహిత్ నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రోహిత్ తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించి బైఠాయించారు. తమ పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేశ్‌ క్రమశిక్షణకు మారుపేరని..  తెదేపా కేడర్ కు ఆదర్శంగా నిలిచారన్నారు. 

ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని.. ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదన్నారు. ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా తమ పెద్దమ్మ భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెదన్నారు. అలాంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైకాపా నేతలకు నోరెలా వచ్చిందో అర్థంకావడంలేదని నారా రోహిత్‌ మండిపడ్డారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని