AP News: వరదలతో  జనం అల్లాడుతుంటే.. ఇసుక అమ్ముతాం అని ప్రకటనలిస్తారా?: పవన్‌ 

రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ట్విటర్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టిస్తోందని  ఆవేదన..

Published : 22 Nov 2021 01:24 IST

అమరావతి:  రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ట్విటర్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టిస్తోందని  ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రజలు ఇళ్లు, వాకిళ్లు, పశు నష్టం, పంట నష్టం, పచ్చటి పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తున్నారు.  ఇలాంటి సమయంలో వైకాపా ప్రభుత్వం ఇసుక అమ్ముతాం అని ప్రకటనలు  ఇస్తోంది.  అసలు ఈ ప్రభుత్వానకి ఇంగిత జ్హానం ఉందా?’’ అని పవన్‌  ప్రశ్నించారు.   జల ప్రళయంతో చేతికొచ్చిన పంటలు, ఇళ్లు, పశు సంపద.. సర్వం కోల్పోయి ప్రజలు బాధలో ఉంటే అందరికీ అందుబాటులో ఇసుక అని మీ వ్యాపార ప్రకటనలు ఏమిటి? అని ఆపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు.  వరదలతో జనం సాయం కోసం ఎదురు చూస్తుంటే..  ప్రచారం కావాల్సి వచ్చిందా అని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని