Rakesh Tikait: భాజపా ఓటమి.. రైతు ఉద్యమ విజయమే!
రెండు రాష్ట్రాల్లో భాజపా పరాజయం కావడం రైతు ఉద్యమ విజయమేనని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నేత రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు.
రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్
దిల్లీ: హిమాచల్ ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో భాజపాకు ప్రతికూల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా పరాజయం కావడం రైతు ఉద్యమ విజయమేనని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నేత రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న హరియాణాలో భాజపా ఓటమి చెందడంపై రైతు నేత ఈ విధంగా స్పందించారు.
‘హిమాచల్ ప్రదేశ్‌లో, హరియాణాలో జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా ఓటమిపాలయ్యింది. తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు వారిని ఓడించారు. భాజపా ఓటమి.. మా ఉద్యమ విజయం’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. రైతు ఉద్యమానికి మద్దతిస్తున్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నేత అభయ్ సింగ్ చౌటాలా విజయంతో ఇది మరోసారి స్పష్టమైందన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకుంటే భాజపాకు ఓటమి తప్పదన్న ఆయన.. వారి వాగ్దానాలకు, చేస్తున్న పనులకు పొంతన లేదని దుయ్యబట్టారు. ‘దేశ ప్రజలను అణచివేయాలని కోరుకుంటున్న కొందరు నాయకులు బలమైన వ్యూహాలు రచిస్తున్నారు. దేశాన్ని అమ్మేయాలని చూస్తున్నారు. రోజురోజుకు అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది (ద్రవ్యోల్బణం పెరుగుతోంది). వారి పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు’ అంటూ రాకేశ్ టికాయిత్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇదిలాఉంటే, హిమాచల్‌లో మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించగా.. హరియాణాలో పోలింగ్ జరిగిన ఒక స్థానంలో ఐఎన్ఎల్డీ గెలిచింది. దీంతో భాజపాకు షాక్ తగిలినట్లయ్యింది. హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్ సొంత జిల్లాలోని లోక్‌సభ స్థానాన్ని, మరో మూడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడం దీనికి కారణం. అఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో తాజా ఉప ఎన్నికల ఫలితాలు భాజపాకు ఇబ్బందికరమేనని రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్‌బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్‌గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్‌కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్