కేసీఆర్‌తో లైడిటెక్టర్‌ పరీక్షకు నేను సిద్ధం: కేటీఆర్‌ ట్వీట్‌పై రేవంత్‌

తాను విసిరిన వైట్‌ ఛాలెంజ్‌ సవాల్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మళ్లీ ట్వీట్‌ చేశారు.

Updated : 12 Oct 2022 15:36 IST

హైదరాబాద్‌: తాను విసిరిన వైట్‌ ఛాలెంజ్‌ సవాల్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. సీఎం కేసీఆర్‌తో కలిసి లైడిటెక్టర్‌ పరీక్షకు తాను సిద్ధమని ప్రకటించారు. దీనికి సమయం, స్థలం చెప్పాలన్నారు. కేసీఆర్‌ అవినీతి ఆరోపణలపై లైడిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమని పేర్కొన్నారు. సీబీఐ కేసులు, సహారా పీఎఫ్‌ అక్రమాలపై పరీక్షలకు కేసీఆర్‌ సిద్ధమా? అని రేవంత్‌ సవాల్‌ విసిరారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని