TS News: కాంగ్రెస్‌ పీఏసీ భేటీ.. భట్టి, రేణుకా చౌదరి మధ్య వాడీ వేడి చర్చ

గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో నాయకుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. హుజురాబాద్ ఓటమి, పార్టీ సభ్యత్వ నమోదు

Updated : 24 Sep 2022 15:10 IST

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో నాయకుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. హుజూరాబాద్ ఓటమి, పార్టీ సభ్యత్వ నమోదు, డిసెంబర్ 9న నిర్వహించనున్న భారీ బహిరంగ సభ తదితర అంశాలపై పీఏసీ చర్చించింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు కమిటీ ముందుకు కొన్ని అంశాలను తీసుకొచ్చారు.

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితిపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య వాడీవేడి చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోకుండా బలహీనపడేటట్లు చేస్తున్నారని భట్టి విక్రమార్కపై రేణుక అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సీఎల్పీ నేతనని.. పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నట్లు భట్టి విక్రమార్క సమాధానమిచ్చినా ఆమె సంతృప్తి చెందలేదు. సీఎల్పీ నేత అయితే సమస్యలు పరిష్కరించాలే కానీ సృష్టించ వద్దని రేణుక హితవు పలికారు.

అనంతరం మాజీ ఎంపీ వీహెచ్‌ మాట్లాడుతూ తనను మీడియా ముందు మాట్లాడవద్దని అంటున్నారని.. కొంతమంది నేతలు మాత్రం ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారని అన్నారు. హుజూరాబాద్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాకుండా ఎస్సీని నిలబెడితే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అభ్యర్థి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు. ఓ వైపు సమావేశం జరుగుతుండగానే మరోవైపు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గాంధీభవన్‌ నుంచి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని