Chandrababu: తెలిసో.. తెలియకో ఓట్లేస్తే ప్రాణాలు బలిగొంటారా?: చంద్రబాబు

రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. 

Updated : 04 Dec 2021 17:20 IST

మంగళగిరి: రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వరదల విషయంలో ఏం చేయాలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 

‘‘వైకాపా ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించింది. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించకపోవడంతో గేట్లన్నీ మొత్తం కొట్టుకుపోయాయి. ప్రభుత్వ తప్పిదం వల్లే వరదల్లో 62మంది చనిపోయారు. వరదలతో రూ.6వేల కోట్ల పంట, ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాణనష్టమని కేంద్రమంత్రి చేసిన ప్రకటనకు ఏం సమాధానం చెబుతారు?

తెలిసో.. తెలియకో.. ఓట్లు వేస్తే ప్రజల ప్రాణాలు బలిగొంటారా?నిర్లక్ష్యంపై న్యాయ విచారణ అడిగితే ఎందుకు అంగీకరించలేదు?ఒక వ్యక్తి 9మందిని ఎక్కించుకొని చాలా వరకు కాపాడాడు. ఏడుగురిని కాపాడగలిగాడు.. శ్వాస ఆడక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు’’ అని చంద్రబాబు అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని