AP News: చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. ఏపీ వ్యాప్తంగా తెదేపా నిరసనలు

తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబంపై వైకాపా నేతలు నిన్న అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని

Updated : 20 Nov 2021 14:06 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబంపై వైకాపా నేతలు నిన్న అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. సత్తెనపల్లి- అమరావతి ప్రధాన రహదారిపై ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లాలో పలువురు తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆ పార్టీ నేత సుధాకర్‌రెడ్డితో పాటు ఇతరులను చిత్తూరు వన్‌టౌన్‌కు తరలించారు. జీడి నెల్లూరు నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త చిట్టిబాబును గృహనిర్బంధం చేశారు. విజయనగరం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద తెలుగు యువత నేలపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధర్నా చేయకుండా గృహనిర్బంధం చేశారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం బలుసుపాడు అడ్డురోడ్డు వద్ద తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా నంద్యాలలోనూ తెదేపా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ క్రమంలో తెదేపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని