Revanth Reddy: కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా: రేవంత్

ఎంతమంది నాయకులు బయటకు వెళ్లినా కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే బలమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలు కష్టపడితేనే దిల్లీలో

Updated : 24 Sep 2022 15:09 IST

హైదరాబాద్‌: ఎంతమంది నాయకులు బయటకు వెళ్లినా కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే బలమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలు కష్టపడితేనే దిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందని చెప్పారు. కొంపల్లిలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్‌ కార్యకర్తల శిక్షణా తరగతుల్లో రేవంత్‌ మాట్లాడారు. రాష్ట్రాన్ని తెరాస, భాజపా కలిసి దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు తోడు దొంగలేనన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉండాల్సింది పోయి.. వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. రైతుల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందన్నారు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికే ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు రేవంత్‌ చెప్పారు. 

‘‘కాంగ్రెస్‌లో క్రమశిక్షణ ముఖ్యం. మేం పదవులు అనుభవిస్తున్నామంటే దానికి కారణం కార్యకర్తలే. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా. సోనియమ్మ రాజ్యం కోసం కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటా. కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ కార్యకర్తలపై ఉంది. కష్టపడే కార్యకర్తలను రాహుల్‌గాంధీతో సన్మానం చేయిస్తా. కష్టపడని వారిపై జనవరి 26 తర్వాత నేనే చర్యలు తీసుకుంటా. సోనియమ్మ రాజ్యం కోసం రాబోయే 18 నెలలు దీక్షగా పనిచేయాలి’’  అని రేవంత్‌ కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని