Revanth Reddy: తెరాస ఎంపీలు ప్రజల్ని మభ్యపెడుతున్నారు: రేవంత్‌రెడ్డి

ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో తెరాస ఎంపీలు

Updated : 06 Dec 2021 15:47 IST

దిల్లీ: ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో తెరాస ఎంపీలు తూతూ మంత్రంగా నిరసన తెలుపుతున్నారని ఆరోపించారు. దిల్లీలో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. సభ వాయిదా పడిన సమయంలో తెరాస ఎంపీలు సెంట్రల్‌హాల్లో ప్లకార్డులతో ఫొటోలు దిగి పార్లమెంట్‌లో నిరసన తెలుపుతున్నట్లు ప్రచారం చేసుకున్నారని ఆక్షేపించారు. ప్రజల్ని మభ్యపెడుతూ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. నిజంగా నిరసన తెలపాలనుకుంటే పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో సీఎం కేసీఆర్‌ ఎందుకు దిల్లీ రావడం లేదని.. సంబంధిత శాఖామంత్రులు, ప్రధానిని ఎందుకు కలిసి నిలదీయడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని