Revanth Reddy: కోకాపేట్‌ భూములపై సీబీఐకి రేవంత్ ఫిర్యాదు 

తెలంగాణలో కోకాపేట్‌, ఖానామెట్‌ భూముల అమ్మకాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

Updated : 09 Sep 2021 14:43 IST

దిల్లీ: తెలంగాణలో కోకాపేట్‌, ఖానామెట్‌ భూముల అమ్మకాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను అనుకూలమైన వారికి కట్టబెట్టారని ఆరోపించారు. దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.వెయ్యి నుంచి 1,500 కోట్ల నష్టం జరిగిందని ఫిర్యాదులో రేవంత్‌ పేర్కొన్నారు. ఈ భూముల అమ్మకంపై విచారణ జరపించాలని ఆయన సీబీఐ డైరెక్టర్‌ను కోరారు. అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. రాజకీయాలను తెరాస కలుషితం చేసి ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కోకాపేట్‌, ఖానామెట్‌ భూముల్లో గోల్‌మాల్‌ జరిగిందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని