TS News: అలా చేసిన కేసీఆర్‌ను ఎలా నమ్మాలి?: రేవంత్‌

గతంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని సీఎం కేసీఆర్‌ పంజాబ్‌లో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తామంటే ఎలా నమ్మాలని

Updated : 21 Nov 2021 20:52 IST

హైదరాబాద్‌: గతంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని సీఎం కేసీఆర్‌ పంజాబ్‌లో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తామంటే ఎలా నమ్మాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల గుర్తింపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని రేవంత్‌ విమర్శించారు.

ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 7,500 మంది రైతులు చనిపోయారని వారి కుటుంబాలను ఆదుకోలేదన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇస్తామన్న వరద పరిహారం ఇవ్వలేదని రేవంత్‌ ఆరోపించారు. ఇలా ప్రజలకిచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో పంజాబ్‌లో చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.3లక్షలు ఇస్తామంటే ఎలా నమ్మేదని రేవంత్‌ ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని