YS Sharmila: కేసీఆర్‌ స్పందించే వరకూ దీక్షలోనే కూర్చుంటా: షర్మిల 

నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీ బాలిక హత్యాచార ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

Updated : 15 Sep 2021 15:16 IST

హైదరాబాద్‌: నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో బాలిక హత్యాచార ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. ఈ మేరకు బాలిక ఇంటికి వెళ్లిన ఆమె అక్కడ దీక్షలో కూర్చున్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని షర్మిల నిలదీశారు. దీనిపై సీఎం స్పందించే వరకూ దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇది పోలీసుల వైఫల్యం కాదా?ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని ఆమె ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ప్రకటించాలని షర్మిల డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని