YS Sharmila: పోలీసులు చేయలేని న్యాయం దేవుడు చేశాడు.: షర్మిల

సైదాబాద్‌ హత్యాచార ఘటనలో ఏడు రోజులైనా బాధిత కుటుంబాన్ని  ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. లోటస్‌పాండ్‌లోని

Updated : 16 Sep 2021 20:57 IST

హైదరాబాద్‌: సైదాబాద్‌ హత్యాచార ఘటనలో ఏడు రోజులైనా బాధిత కుటుంబాన్ని  ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ...

‘‘మా ఒత్తిడి వల్లే మంత్రుల్లో కదలిక వచ్చింది. వారి ఇంటికి వెళ్లి పరిహారం ఇవ్వడంతో పాటు, కేసు కొలిక్కి వచ్చేలా చేసింది. శాంతి యుతంగా  దీక్ష చేస్తుంటే రాత్రి 2గంటల సమయంలో దాదాపు 200 మంది పోలీసులు మాపై దాడికి దిగి అరెస్టు చేసి గృహనిర్బంధం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తెలంగాణలో లేదా? ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? దీక్షను భగ్నం చేసిన ప్రభుత్వ తీరు తాలిబన్ల వ్యవహారశైలిని తలపిస్తోంది. తాలిబన్ల చేతిలో అఫ్గానిస్తాన్‌ బందీ అయినట్టు.. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయింది. పోలీసులు చేయలేని న్యాయం.. దేవుడు చేశాడు. నిందితులను కఠినంగా శిక్షించకపోతే ఇలాంటి ఘటనలు ఆగవు. మద్యం అమ్మకాలను పెంచేందుకు ఉన్న చిత్త శుద్ధి.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో లేదు’’ అని షర్మిల విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని