Priyanka: నాతో ఫొటో దిగడమే నేరమా? అయితే నాపై కూడా చర్యలు తీసుకోండి..

తనతో ఫొటోలకు పోజులిచ్చిన కొందరు మహిళా పోలీసులకు చర్యలు తీసుకొనేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రణాళికలు రచిస్తున్నారని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక.......

Published : 21 Oct 2021 16:25 IST

ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు

ఖ్‌నవూ: తనతో ఫొటోలకు పోజులిచ్చిన కొందరు మహిళా పోలీసులపై చర్యలు తీసుకొనేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ యోచిస్తున్నారని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు.ఈ మేరకు కొందరు మహిళా పోలీసులు తనతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్‌ చేశారు. ‘ఈ ఫొటోతో యోగి జీ ఎంతో బాధపడ్డారని వార్తలు వస్తున్నాయి.. ఆయన ఈ మహిళా పోలీసులపై చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. పోలీస్‌ కస్టడీలో మృతిచెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబ సభ్యులను కలిసేందుకు ఆగ్రాకు వెళ్తుండగా ఫొటో ఈ దిగినట్టు పేర్కొన్నారు. తనతో వారు ఫొటోలు దిగడం నేరమైతే.. అందుకు తనను కూడా శిక్షించాలన్నారు. కష్టపడి పనిచేసే నిబద్ధత కలిగిన మహిళా పోలీసుల కెరీర్‌ని పాడుచేయడం ప్రభుత్వానికి తగదన్నారు. కొందరు మహిళా పోలీసులు ప్రియాంకా గాంధీ వాద్రాతో ఫొటోలకు పోజు ఇచ్చిన వ్యవహారంపై విచారణ జరుగుతున్నట్టు  సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. ఏవైనా సర్వీస్‌ నిబంధనలను ఉల్లంఘించారేమోనన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఇటీవల ఆగ్రాలో రూ.25లక్షల దొంగతనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్‌ అనే వ్యక్తి పోలీసుల కస్టడీలో ప్రాణాలు కోల్పోగా.. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రాను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు లఖ్‌నవూ - ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్‌ప్లాజా వద్ద ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు ప్రియాంకను అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విడిచిపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని