ప్రపంచంలోనే అతి సన్నటి నది

పొలాల్లో నీటిని మళ్లించేందుకు నిర్మించిన మార్గంలా ఉంది కదూ.. కానీ అది ప్రపంచంలోనే అతి సన్నటి నది.

Published : 26 Jan 2022 11:19 IST

పొలాల్లో నీటిని మళ్లించేందుకు నిర్మించిన మార్గంలా ఉంది కదూ.. కానీ అది ప్రపంచంలోనే అతి సన్నటి నది. దాని పేరు హులాయి. చైనాలోని మంగోలియాలో ఉందీ నది. దీని వెడల్పు కొన్ని సెంటీమీటర్లే. కొన్ని ప్రాంతాల్లో ఈ నదిపై నుంచి ఒకే ఉదుటన దాటొచ్చు కూడా. హులాయి నది పొడవు 17 కిలోమీటర్లు. సగటు వెడల్పు మాత్రం 15 సెంటీమీటర్లే. కొన్ని చోట్ల అయితే ఇంతకన్నా తక్కువగానే ఉంటుంది. చైనా నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఈ నది గత 10 వేల ఏళ్లుగా ప్రవహిస్తూనే ఉంది. భూగర్భ నీటి బుడగ నుంచి ఈ నది ప్రవాహం ప్రారంభమై.. హెగ్జిగ్టెన్‌ గ్రాస్‌లాండ్‌లోని దలాయ్‌ నూర్‌ సరస్సులో కలుస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని