ధోనీ.. క్రికెట్‌ ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది..

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి రెండు రోజులు గడుస్తున్నా ఇంకా అభినందనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు ముగిశాక...

Updated : 18 Aug 2020 13:17 IST

పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి రెండు రోజులు గడుస్తున్నా ఇంకా అభిమానుల నుంచి స్పందనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు ముగిశాక పాకిస్థాన్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ట్విటర్‌లో స్పందించాడు. ధోనీ సేవలను కొనియాడాడు. గొప్ప కెరీర్‌ సొంతం చేసుకున్నందుకు కంగ్రాట్స్‌ చెప్పాడు. అతడి నాయకత్వం, పోరాట పటిమను క్రికెట్‌ ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ప్రశంసించాడు. ఇకపై ధోనీ భవిష్యత్‌ మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించాడు. మరోవైపు ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో ఓటమిపాలవ్వగా, పాకిస్థాన్‌కు రెండో టెస్టులో వరణుడు కనికరించలేదు. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో సోమవారం డ్రా అయింది.

ఇక భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ధోనీ, రైనా శనివారం రాత్రి రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇతర దేశాల క్రికెటర్లు సైతం ధోనీ సేవలను కొనియాడుతున్నారు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ సారథి అని, మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుపొందిన ఏకైక కెప్టెన్‌ అని గుర్తు చేసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని