రైనా కూడా గుడ్‌బై!

టీమిండియా క్రికెటర్‌ సురేశ్‌ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు సామాజిక......

Updated : 15 Aug 2020 21:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా క్రికెటర్‌ సురేశ్‌ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా రిటైర్మెంట్‌ ప్రకటించడం గమనార్హం. ‘‘ధోనీ నీతో కలిసి ఆడడం ఓ మధురానుభూతి.. ఈ ప్రయాణంలో నేనూ మీతో చేరాలని నిర్ణయించున్నా. జైహింద్‌’’ అంటూ  ధోనీతో కలిసి ఉన్న చిత్రాన్ని జతచేసి రైనా తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.

2005లో వన్డే క్రికెట్‌ అరంగేట్రం చేసిన రైనా మొత్తం 266 వన్డేల్లో 5,615 పరుగులు చేశాడు. అత్యధికంగా 116 పరుగులు చేసిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్స్‌మన్‌ మొత్తం ఐదు సెంచరీలు, 36 అర్ధశతకాలు నమోదు చేశాడు. వన్డేల్లో 36 వికెట్లు కూడా తీశాడు. 2010లో టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టిన రైనా 18 టెస్టుల్లో 768 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది. 193 ఐపీఎల్‌ మ్యాచుల్లో 5,368 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 38 అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ జట్టులో తొలుత సభ్యుడిగా ఉన్న రైనా.. ప్రస్తుతం ధోనీతో కలిసి చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఇలా ఒకే జట్టులో ఆడుతున్న ఇద్దరు బ్యాట్స్‌మన్లు ఒకేరోజు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని