అందరి కన్నా వాళ్లే జాగ్రత్తగా ఉండాలి: పఠాన్‌

కరోనా వైరస్‌ కారణంగా కొన్ని నెలలుగా ఆటలన్నీ నిలిచిపోయన వేళ ఇప్పుడిప్పుడే కొన్ని క్రీడలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వెస్టిండీస్...

Published : 20 Jul 2020 01:49 IST

పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి 4-6 వారాలు పడుతుంది

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ కారణంగా కొన్ని నెలలుగా ఆటలన్నీ నిలిచిపోయన వేళ ఇప్పుడిప్పుడే కొన్ని క్రీడలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య బయో సెక్యూర్‌ విధానంలో అంతర్జాతీయ క్రికెట్‌ మొదలైంది. మరోవైపు భారత్‌లో ఈ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పుడప్పుడే ఇక్కడ ఆటలు తిరిగి కొనసాగేలా కనిపించడం లేదు. దీంతో ఆటగాళ్లు ఎప్పుడు బరిలోకి దిగుతారనే విషయంపై సందిగ్ధత నెలకొంది. కాగా, ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే క్రీడాకారులు ఫిట్‌నెస్‌ కోల్పోతారనే సంగతి తెలిసిందే. 

ఇదే విషయంపై స్పందించిన మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తాజాగా క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ ఫాస్ట్‌ బౌలర్లపై ఆందోళన వ్యక్తం చేశాడు. పేస్‌ బౌలర్లు తిరిగి గాడిలో పడాలంటే కనీసం 4-6 వారాల సమయం పడుతుందని చెప్పాడు. ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆటగాళ్ల శరీరం పట్టు కోల్పోతుందని, ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి బౌలింగ్‌  చేయాలంటే కష్టతరమని, ఇప్పుడు సాధన చేస్తే ఫాస్ట్‌ బౌలర్లు గాయాల బారిన పడే అవకాశం కూడా ఉందన్నాడు. దీంతో స్పిన్నర్లు, బ్యాట్స్‌మన్‌ కన్నా పేసర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. చివరగా కరోనా గురించి మాట్లాడుతూ ఈ కొత్త నిబంధనలు అమల్లో ఉన్నని రోజులు బౌలర్లకు కష్టమని వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని