పాండ్య, మోరిస్‌కు మందలింపు
ముంబయి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, బెంగళూరు ఆటగాడు క్రిస్ మోరిస్‌ను టీ20 లీగ్ యాజమాన్యం మందలించింది. వీరిద్దరూ గత మ్యాచ్‌లో లీగ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. మ్యాచ్‌లో 19వ ఓవర్ మోరిస్ వేశాడు. ఆ ఓవర్లో ఐదో బంతికి పాండ్య సిక్సర్ కొట్టాడు. వెంటనే..
(Photo: twitter)
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, బెంగళూరు ఆటగాడు క్రిస్ మోరిస్‌ను టీ20 లీగ్ యాజమాన్యం మందలించింది. వీరిద్దరూ గత మ్యాచ్‌లో లీగ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. మ్యాచ్‌లో 19వ ఓవర్ మోరిస్ వేశాడు. ఆ ఓవర్లో ఐదో బంతికి పాండ్య సిక్సర్ కొట్టాడు. వెంటనే.. మోరిస్‌ను ఉద్దేశిస్తూ పాండ్య కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఆ తర్వాతి బంతికి పాండ్యను మోరిస్ ఔట్ చేసి అదే స్థాయిలో స్పందించాడు. దీంతో వీరిద్దరి మధ్య కొంతసేపు మాటల యుద్ధం జరిగింది. ఇది గమనించిన ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ ముగియగానే లీగ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇద్దరు ఆటగాళ్లు ఒప్పుకొన్నారు. దీంతో లీగ్ యాజమాన్యం ఆ ఇద్దర్నీ మందలించి ఎటువంటి శిక్షా వేయకుండా వదిలేసింది.
(Photo: twitter)
బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు బెంగళూరును 5 వికెట్ల తేడాతో ఓడించింది. 16 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు తన తర్వాతి 2 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ చేరుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో అద్భుత అర్ధశతకం చేసిన సూర్యకుమార్ యాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో పాండ్య 17 (15బంతుల్లో 2 సిక్సర్లు) పరుగులు, మోరిస్ 4 ఓవర్లలో ఒక వికెట్ తీసి 36 పరుగులు ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM