కోహ్లీ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతడే మ్యాచ్‌ ఆడినా 110 శాతం కష్టపడతాడని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ అన్నాడు...

Published : 21 Nov 2020 16:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతడే మ్యాచ్‌ ఆడినా 110 శాతం కష్టపడతాడని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ అన్నాడు. శనివారం అతడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా సారథి తక్కువ మ్యాచ్‌లే ఆడుతున్నా.. అతడి ఆటతీరులో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పాడు. వంద శాతంకిపైగా కష్టపడుతున్నప్పుడు అంతకుమించిన ఆత్మవిశ్వాసం అవసరం లేదన్నాడు. రాబోయే రోజుల్లో పరుగుల ప్రవాహం కొనసాగించడానికి సిద్ధంగా ఉంటాడని స్టోయినిస్‌ చెప్పాడు. 

‘కోహ్లీని కట్టడి చేయడానికి మా ప్రణాళికలు మాకున్నాయి. గతంలో కొన్నిసార్లు అవి పని చేశాయి. మరికొన్ని సార్లు విఫలమయ్యాయి. కానీ ఈసారి మాకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నా’ అని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ పేర్కొన్నాడు. అనంతరం దిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌కోచ్‌ రికీపాంటింగ్‌పై స్పందిస్తూ.. అతడికి తాను వీరాభిమానినని చెప్పాడు. ఇటీవల పూర్తి అయిన 13వ సీజన్‌లో తన ఆట మెరుగవ్వడానికి సహాయం చేశాడని చెప్పాడు. ఇక ఈ సీజన్‌లో మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన స్టోయినిస్‌ 352 పరుగులు చేసి 13 వికెట్లు పడగొట్టాడు. దాంతో దిల్లీ తొలిసారి ఫైనల్స్‌ చేరడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇప్పుడు భారత్‌తో సుదీర్ఘ పర్యటనకు సిద్ధమవుతున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని