నేటి నుంచి జాతీయ అమెచ్యూర్‌ గోల్ఫ్‌

జాతీయ అమెచ్యూర్‌ గోల్ఫ్‌ లీగ్‌ (ఎన్‌ఏజీఎల్‌) మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. గచ్చిబౌలి బౌల్డర్‌ హిల్స్‌ గోల్ఫ్‌ కోర్స్‌ ఈ లీగ్‌కు వేదిక. టీ గోల్ఫ్‌ ఫౌండేషన్‌

Updated : 09 Nov 2021 08:21 IST

మాదాపూర్‌, న్యూస్‌టుడే: జాతీయ అమెచ్యూర్‌ గోల్ఫ్‌ లీగ్‌ (ఎన్‌ఏజీఎల్‌) మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. గచ్చిబౌలి బౌల్డర్‌ హిల్స్‌ గోల్ఫ్‌ కోర్స్‌ ఈ లీగ్‌కు వేదిక. టీ గోల్ఫ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు వివిధ నగరాల నుంచి 96 మంది క్రీడాకారులు   హాజరుకానున్నారు. సోమవారం బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు పోటీల లోగోను ఆవిష్కరించింది. తాను కూడా పలుమార్లు గోల్ఫ్‌ ఆడినట్లు.. ఒకసారి గోల్ఫ్‌ ఆడిన వారు దాని మీద ఆసక్తిని అంత తొందరగా వదులుకోలేరని సింధు ఈ సందర్భంగా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని