క్రికెట్‌కు పార్థివ్‌ పటేల్‌ గుడ్‌బై

టీమిండియా వికెట్‌ కీపర్‌ పార్థివ్ పటేల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై పలుకుతున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. 18 ఏళ్ల తన క్రికెట్‌ ప్రయాణాన్ని

Updated : 09 Dec 2020 13:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా వికెట్‌ కీపర్‌ పార్థివ్ పటేల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై పలుకుతున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. 18 ఏళ్ల తన క్రికెట్‌ ప్రయాణాన్ని ముగించాలనుకుంటున్నట్లు భావోద్వేగంతో తెలిపాడు. టీమిండియా తనపై విశ్వాసాన్ని ఉంచి 17 ఏళ్ల వయసులోనే అవకాశం కల్పించిందని అన్నాడు. భారత్ తరఫున పార్థివ్‌ 25 టెస్టులు, 38 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. శ్రీలంకతో 2012లో చివరి వన్డే ఆడాడు.

‘‘అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటిస్తున్నా. 18 ఏళ్ల నా క్రికెట్ ప్రయాణాన్ని నేటితో ముగిస్తున్నా. నా కెరీర్‌లో సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. 17 ఏళ్ల వయసులో నాపై విశ్వాసాన్ని ఉంచి బీసీసీఐ అవకాశం ఇచ్చింది. కెరీర్‌లో మార్గదర్శకం చేస్తూ అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’’ అని పార్థివ్‌ పేర్కొన్నాడు. కెప్టెన్లందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తొలి అవకాశం ఇచ్చిన గంగూలీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు. 2002లో దాదా కెప్టెన్సీలోనే పార్థివ్‌ ఇంగ్లాండ్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేశాడు.

35 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ పార్థివ్‌ టెస్టుల్లో 934, వన్డేల్లో 1696 పరుగులు చేశాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు పోటీ క్రికెట్‌ నుంచి తప్పుకున్నట్లు పార్థివ్‌ వెల్లడించాడు. ఐపీఎల్‌‌లో తనకి అవకాశాలు ఇచ్చిన జట్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఓపెనర్‌గా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు లీగ్‌‌లో 2848 పరుగులు చేశాడు. 13వ సీజన్‌లో బెంగళూరు జట్టులో ఉన్న పార్థివ్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం రాలేదు. గత 13 సీజన్లలో అతడు ముంబయి, చెన్నై, బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, దేశవాళీ క్రికెట్‌లో పార్థివ్ సత్తాచాటాడు. 194 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 11,240 పరుగులు చేశాడు. దీనిలో 27 శతకాలు ఉన్నాయి. 

ఇదీ చదవండి

టెస్టు సిరీస్‌కు ముందే ఆసీస్‌కు షాక్‌

ఇంటికొచ్చేస్తున్నా: పాండ్య


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని