బీసీసీఐకి చెప్పకుండానే రైనా వీడ్కోలు!

టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ, అతడి మిత్రుడు సురేశ్‌ రైనా ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఇద్దరూ కలిసి అభిమానులకు వరుస షాకులు ఇచ్చారు.  తన నిష్క్రమణ గురించి బీసీసీఐకి రైనా ముందుగా చెప్పలేదని తెలిసింది. ఒకరోజు ఆలస్యంగా తమకు సమాచారం....

Published : 17 Aug 2020 17:11 IST

ప్రకటించిన మరునాడు సమాచారం ఇచ్చాడన్న బీసీసీఐ

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ, అతడి మిత్రుడు సురేశ్‌ రైనా ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఇద్దరూ కలిసి అభిమానులకు వరుస షాకులు ఇచ్చారు. తన నిష్క్రమణ గురించి బీసీసీఐకి రైనా ముందుగా చెప్పలేదని తెలిసింది. ఒకరోజు ఆలస్యంగా తమకు సమాచారం అందించాడని బోర్డు వెల్లడించింది.

సాధారణంగా ఏ ఆటగాడైన తన వీడ్కోలు సంగతిని బీసీసీఐకి ముందుగానే చెప్పడం ఆనవాయితీ. సురేశ్‌ రైనా ఇందుకు భిన్నంగా నడుచుకోవడం గమనార్హం. ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పెట్టిన అరగంటకే రైనా తన రిటైర్మెంట్‌ గురించి సోషల్‌ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తన మిత్రుడైన మహీ ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌ ఆడడన్న భావోద్వేగంలో అతడు ఇలా చేసి ఉండొచ్చని బోర్డు అధికారులు భావిస్తున్నారు.

తమకు సమాచారం ఇవ్వకపోవడంతోనే రైనా వీడ్కోలు గురించి బీసీసీఐ వెబ్‌సైట్‌లో శనివారం రాత్రి ప్రకటన ఇవ్వలేదు. అధికారికంగా ఆదివారం సమాచారం రావడంతో ఆ రోజు సాయంత్రం ప్రకటనను విడుదల చేశారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ ‌గంగూలీ, కార్యదర్శి జే షా, కోశాధికారి అరుణ్ ధుమాల్‌ శుభాకాంక్షలను ప్రకటనలో జతచేశారు. 2005, జులై 30న శ్రీలంకతో వన్డేలో రైనా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని