BCCI: ఆటగాళ్ల విశ్రాంతి.. ఇక బీసీసీఐ చేతుల్లో

ఆటగాళ్లు నెలల తరబడి బయో బబుల్‌లో ఉండటం, వరుసగా మ్యాచ్‌లు ఆడి అలసిపోవడం టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వైఫల్యానికి ఓ ముఖ్య కారణమన్న విమర్శలు బలంగా వినిపించిన నేపథ్యంలో బీసీసీఐ అప్రమత్తం అయింది. ఇకపై

Updated : 11 Nov 2021 10:01 IST

ముంబయి: ఆటగాళ్లు నెలల తరబడి బయో బబుల్‌లో ఉండటం, వరుసగా మ్యాచ్‌లు ఆడి అలసిపోవడం టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వైఫల్యానికి ఓ ముఖ్య కారణమన్న విమర్శలు బలంగా వినిపించిన నేపథ్యంలో బీసీసీఐ అప్రమత్తం అయింది. ఇకపై ఆటగాళ్లపై పని ఒత్తిడిని అంచనా వేసి, ఎవరికి ఎప్పుడు విశ్రాంతి అవసరమో బోర్డే నిర్ణయించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఒక కమిటీని కూడా నియమించబోతోందట బీసీసీఐ. అందులో కొత్త కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం సభ్యుడిగా ఉంటాడట. ఏ ఆటగాడు ఎన్ని మ్యాచ్‌లు ఆడుతున్నాడు.. ఎంత కాలం బయో బబుల్లో గడుపుతున్నాడు అన్న విషయాలను సమీక్షించి.. నిర్ణీత వ్యవధి తర్వాత ప్రతి ఆటగాడికీ విశ్రాంతి ఇచ్చేలా విధానం రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటిదాకా విశ్రాంతి తీసుకోవడం ఆటగాళ్లు చేతుల్లోనే ఉండేది. కొన్నిసార్లు విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్న క్రికెటర్లను గుర్తించి సెలక్టర్లే వారికి విశ్రాంతి కల్పించేవారు. అయితే అలసట, బయో బబుల్‌ ఒత్తిడి గురించి ఆటగాళ్ల నుంచి ఫిర్యాదులు వస్తుండటం.. టీ20 ప్రపంచకప్‌ వైఫల్యం నేపథ్యంలో విమర్శలు పెరగడంతో బీసీసీఐ కొత్త విధానానికి సిద్ధమైంది. దీని ప్రకారం ఏ ఆటగాడికి ఎప్పుడు విశ్రాంతి ఇవ్వాలన్నది బీసీసీఐయే నిర్ణయించబోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని