రోహిత్‌కు రెస్ట్‌.. టెస్టుల్లోకి సిరాజ్‌..టీ20ల్లోకి చక్రవర్తి

ఆస్ట్రేలియాలో పర్యటించే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్‌ శర్మకు మూడు ఫార్మాట్లలో విశ్రాంతినిచ్చింది.  రోహిత్‌ లేకపోవడంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్లకు కేఎల్‌ రాహుల్‌..

Updated : 26 Oct 2020 22:17 IST

ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు ఎంపిక

వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌

దిల్లీ: ఆస్ట్రేలియాలో పర్యటించే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్‌ శర్మకు మూడు ఫార్మాట్లలో విశ్రాంతినిచ్చింది.  రోహిత్‌ లేకపోవడంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్లకు కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉంటాడని బోర్డు ప్రకటించింది.

హైదరాబాదీ స్పీడ్‌స్టర్‌ మహ్మద్‌ సిరాజ్‌ టెస్టు జట్టులో ఐదో పేసర్‌గా ఎంపికయ్యాడు. ఇక ఐపీఎల్‌లో కోల్‌కతాకు ఆడుతున్న మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి టీ20 జట్టులో చోటు దక్కింది. రిషభ్ పంత్‌కు వన్డే, టీ20 జట్లలో చోటు దక్కలేదు. రోహిత్‌ శర్మతో పాటు ఇంతకు ముందే గాయపడ్డ ఇషాంత్‌ శర్మ బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షణలో ఉండనున్నారు. నవంబర్ ‌27 నుంచి పర్యటన మొదలవ్వనుంది.

టీ20 జట్టు: విరాట్‌ కోహ్లీ (కె), శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, దీపక్‌ చాహర్‌, వరుణ్‌ చక్రవర్తి

వన్డే జట్టు: విరాట్‌ కోహ్లీ (కె), శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్ ‌కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, మయాంక్‌ అగర్వాల్‌, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌

టెస్టు జట్టు: విరాట్‌ కోహ్లీ (కె), మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీషా, కేఎల్‌ రాహుల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), హనుమ విహారి, శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌కీపర్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), జస్ప్రీత్‌ బుమ్రా, షమి, ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైని, కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్ ‌సిరాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని