Chess: గ్రాండ్‌మాస్టర్‌గా సంకల్ప్‌ గుప్తా

దేశ చదరంగంలో మరో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) అవతరించాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల సంకల్ప్‌ గుప్తా భారత 71వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు.  సెర్బియాలో జరిగిన జీఎం ఆస్క్‌ 3

Updated : 09 Nov 2021 08:11 IST

చెన్నై: దేశ చదరంగంలో మరో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) అవతరించాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల సంకల్ప్‌ గుప్తా భారత 71వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు.  సెర్బియాలో జరిగిన జీఎం ఆస్క్‌ 3 రౌండ్‌ రాబిన్‌ చెస్‌ టోర్నీలో 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన అతను.. మూడో జీఎం నార్మ్‌ ఖాతాలో వేసుకున్నాడు. మూడు జీఎం నార్మ్‌లతో పాటు అతని ఖాతాలో 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లు ఉండడంతో జీఎం హోదా సాధించాడు. ఈ టోర్నీలో అయిదు గేమ్‌లు గెలిచిన అతను.. మరో మూడు డ్రా చేసుకుని, ఒక దాంట్లో ఓటమిపాలయ్యాడు. మార్కరియాన్‌ (రష్యా) కూడా 6.5 పాయింట్లే సాధించినప్పటికీ మెరుగైన టై బ్రేక్‌ స్కోరు కారణంగా టైటిల్‌ అందుకున్నాడు. వరుసగా మూడు టోర్నీలు ఆడిన సంకల్ప్‌  కేవలం 24 రోజుల వ్యవధిలోనే మూడు   జీఎం నార్మ్‌లు దక్కించుకోవడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని