అతడు అయిదు రెట్లు మెరుగయ్యాడు: పాంటింగ్‌

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ స్టాయినిస్‌ను ఆ జట్టు దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్‌ కొనియాడాడు. గత ఏడాదితో పోలిస్తే స్టాయినిస్‌ బహుముఖ పాత్రల్లో ఒదిగిపోతూ అయిదు రెట్లు మెరుగయ్యాడని అన్నాడు.

Published : 24 Nov 2020 01:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ స్టాయినిస్‌ను ఆ జట్టు దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్‌ కొనియాడాడు. గత ఏడాదితో పోలిస్తే స్టాయినిస్‌ బహుముఖ పాత్రల్లో ఒదిగిపోతూ అయిదు రెట్లు మెరుగయ్యాడని అన్నాడు. ఓపెనర్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌, బౌలర్‌గా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో స్టాయినిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న దిల్లీ జట్టుకు పాంటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

‘‘ఐపీఎల్‌ తొలి ప్రాక్టీస్‌ సెషన్లలోనే స్టాయినిస్‌ తన ఆటలో ఎంత మెరుగయ్యాడనేది చూపించాడు. గత కొన్నేళ్లుగా అతడిని గమనిస్తున్నా. చివరి 12 నెలలతో పోలిస్తే అతడు అయిదు రెట్లు పరిణతి చెందాడు. కాగా, భవిష్యత్తులో అతడు టాప్‌ ఆర్డర్‌లో గొప్పగా రాణిస్తాడు. అంతేగాక ఫినిషర్‌గానూ సత్తాచాటగలడు. విభిన్న స్థానాల్లో ఆడగలనని అతడు నిరూపించుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఫార్మాట్లలో స్టాయినిస్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడతాడు. భారత్‌తో జరిగే సిరీస్‌లో దీన్ని చూస్తాం. అవకాశం వస్తే కచ్చితంగా తనేంటో నిరూపించుకుంటాడు. గతంతో పోలిస్తే అతడు స్పిన్‌లో ఎంతో దూకుడుగా ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో ప్రపంచ ఉత్తమ స్నిన్నర్లు అతడిని ఔట్‌ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు’’ అని పాంటింగ్‌ తెలిపాడు. యూఏఈ వేదికగా జరిగిన పదమూడో సీజన్‌లో దిల్లీ తొలిసారి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. దిల్లీ విజయాల్లో స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. 13 వికెట్లతో పాటు 352 పరుగులు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని