Updated : 20/11/2020 18:12 IST

మట్టిపాత్రలో వంట చేసిన రైనా


ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సురేశ్‌ రైనా కుటుంబంతో గడుపుతున్న ఫొటోలు, వ్యాయామం చేస్తున్న ఫొటోలను  సామాజిక మధ్యమాల ద్వారా  అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ఇంట్లో వంట చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ‘శీతాకాలంలో వంట చేయడం గొప్ప అనుభూతి, అలవాటు’అని ఆ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు. దీనిపై మరో క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందిస్తూ.. ‘బ్రో నా కోసం చేస్తున్నావా?’అని సరదాగా కామెంట్‌ చేశాడు. దీనిని వందల మంది అభిమానులు రీట్వీట్‌ చేశారు. ఈ వీడియోలో రైనా సాధారణ వ్యక్తిలా మట్టిపాత్రలో వంట చేయడం అభిమానులను ఆకట్టుకుంది.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

బిజినెస్

పాలిటిక్స్

వెబ్ ప్రత్యేకం

జాతీయం

జనరల్