మహీ.. ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్: కోహ్లీ
టీమ్ఇండియా మాజీ సారథి, దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్పై క్రికెట్ ప్రముఖులు ఇంకా స్పందిస్తున్నారు. భారత క్రికెట్లో చెరగని ముద్ర వేసిన ధోనీకి బీసీసీఐ...
మాటలు రానీ సందర్భాల్లో ఇదీ ఒకటి
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి, దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్పై క్రికెట్ ప్రముఖులు ఇంకా స్పందిస్తున్నారు. భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన ధోనీకి బీసీసీఐ ఘన వీడ్కోలు అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడి గురించి ఎవరేమన్నారో వీడియోలు రూపొందించి ట్విటర్లో అభిమానులతో పంచుకుంటోంది. దానిలో భాగంగా తొలుత విరాట్ కోహ్లీ భావోద్వేగంతో స్పందించిన వీడియోను పోస్టు చేసింది. కోహ్లీ మాట్లాడుతూ.. జీవితంలో పలు సందర్భాల్లో మాటలు రావని, అలాంటి క్షణాల్లో ఇది కూడా ఒకటని పేర్కొన్నాడు. టీమ్ఇండియా ప్రయాణించే బస్సులో మహీ ఎప్పుడూ వెనుక సీటులో కూర్చునేవాడని, అలాగే జట్టు వెనుక అండగా ఉండి నడిపించాడని ప్రశంసించాడు. అతడితో మంచి అనుబంధం ఉందని, ఇద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్లమని గుర్తుచేసుకున్నాడు. మాజీ సారథి తనని బాగా అర్థం చేసుకుంటాడని, అతనెప్పుడూ జట్టు విజయాల కోసమే పరితపించేవాడని తెలిపాడు. ఈ రిటైర్మెంట్ తర్వాత ధోనీ భవిష్యత్తు బాగుండాలని, ప్రశాంతంగా జీవించాలని కోహ్లీ ఆకాంక్షించాడు. చివరి మాటగా ఎప్పటికీ తనకు ధోనీయే కెప్టెన్ అని వ్యాఖ్యానించాడు.
ఎవరెవరు ఏమన్నారు?
* స్వాత్రంత్ర్య దినోత్సవాన సూర్యుడు అస్తమించే సమయంలో అద్భుత కెరీర్‌కు ముగింపు. అతిగొప్ప ఆటగాళ్లలో అతనొకడు. అతడి చిత్తుశుద్ధి, ప్రశాంతంగా ఉండే స్వభావం, ఒత్తిడిని తట్టుకునే శక్తి, విమర్శలను ఎదుర్కొనే ధైర్యం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక కెప్టెన్‌గా అతనెప్పుడూ మౌంట్ ఎవరెస్ట్ మీదే ఉంటాడు. అతడు సాధించని ఘనత ఏదీ లేదు. ఈ సందర్భంగా ధోనీ, సాక్షి, జీవాకు అభినందనలు. మహీ ఇకపై మరింత బాగా జీవితాన్ని ఆస్వాదించాలని ఆశిస్తున్నా. చివరగా.. లెఫ్టినెంట్ కల్నల్ ఎంఎస్ ధోనీకి సెల్యూట్. -హెడ్‌కోచ్ రవిశాస్త్రి
*2011 వన్డే ప్రపంచకప్‌లో అతను బ్యాట్పట్టుకొని మైదానంలోకి వెళ్లడం నాకింకా గుర్తుంది. అప్పుడతని ముఖంలో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది. అది నాలోనూ ప్రేరణ కలిగించింది. అలాగే తన ఆటతో చుట్టుపక్కలవారికి కూడా స్ఫూర్తిగా నిలిచాడు. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా, అంతకుమించిన గొప్ప వ్యక్తిగా ఎదిగిన ధోనీ సర్‌కు ధన్యవాదాలు. -స్మృతి మంధాన
* ధోనీ ఒక స్ఫూర్తి. చిన్న పట్టాణాల్లోని ప్రతీ పిల్లాడికి అతనో కల. దేశం కోసం ఆడాలనుకునే ప్రతీఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత. అతనిలో నాకు నచ్చేది ప్రశాంతంగా ఉండటమే. క్లిష్టపరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురికాడు. అలాగే అతని బ్యాటింగ్, స్టైల్ నాకెంతో నచ్చుతాయి. ఒక బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌కీపర్‌గా అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడు. అతడిలా మరెవరూ ఉండరు. అతనెప్పటికీ లెజెండ్‌గానే ఉంటాడు. -మిథాలి రాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్‌గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్‌తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్‌గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్‌లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్‌లో చూసుకుందాం.. లఖ్‌నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్‌కు వచ్చేసింది. లఖ్‌నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్‌నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్‌లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్‌కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్‌కతాతో ఐపీఎల్ మ్యాచ్‌లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్‌లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్‌ఫాస్ట్ సంగతులు
-
సోషల్‌మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?