గురువుపై సచిన్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తన క్రికెట్‌ గురువు రమాకాంత్‌ అచ్రేకర్‌ను తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అచ్రేకర్‌ జయంతి సందర్భంగా సచిన్‌ మరోసారి ఆయనను స్మరించుకుంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. 

Published : 04 Dec 2020 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తన క్రికెట్‌ గురువు రమాకాంత్‌ అచ్రేకర్‌ను తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అచ్రేకర్‌ జయంతి సందర్భంగా సచిన్‌ గురువారం మరోసారి ఆయనను స్మరించుకుంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. 

‘నా మనసుకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నా. నాతో సహా, ఎంతోమంది యువ క్రికెటర్లు తమలో ఉన్న శక్తిసామర్థ్యాలను ఆటకు ఉన్న శక్తి ద్వారా గుర్తించడానికి ఆయన సాయపడ్డారు. దీనంతటికీ ధన్యవాదాలు, అచ్రేకర్‌ సర్‌’ అని సచిన్‌ ట్వీట్‌ చేశారు. దీనికి తన చిన్నతనంలో గురువు అచ్రేకర్‌ సారథ్యంలో క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోను సచిన్‌ జతచేశారు. 

ఈ ఏడాది జనవరిలోనూ అచ్రేకర్‌ వర్ధంతి సందర్భంగా సచిన్‌ ట్వీట్‌ చేశారు. తన క్రికెట్‌ కెరీర్‌ ఆరంభంలో ఆటకు సంబంధించి ఏబీసీడీలు ఆయన వద్దే నేర్చుకున్నట్లు తెలిపారు. తన క్రికెట్‌ జీవితంలో ఆయన భాగస్వామ్యాన్ని మాటల్లో చెప్పలేనిదిగా సచిన్‌ వర్ణించారు. అచ్రేకర్‌ నిర్మించిన పునాదులపైనే తాను నిలబడినట్లు తెందూల్కర్‌ పేర్కొన్నారు.  గతేడాది జనవరి 2న అనారోగ్య సమస్యలతో అచ్రేకర్‌(87) కన్నుమూసిన విషయం తెలిసిందే. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని