యూఎస్‌ ఓపెన్‌పై నాలుగోసారి జకోవిచ్‌ కన్ను.. 

ఒకవైపు 2020లో కరోనా వైరస్‌ ప్రతాపం చూపిస్తున్నా మరోవైపు టెన్నిస్‌ దిగ్గజం నోవాక్‌ జకోవిచ్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు నాలుగోసారి యూఎస్‌ ఓపెన్‌పై కన్నేశాడు...

Published : 05 Sep 2020 14:51 IST

డబుల్స్‌లో రెండో రౌండ్‌కు చేరుకున్న బోపన్న

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకవైపు 2020లో కరోనా వైరస్‌ ప్రతాపం చూపిస్తున్నా మరోవైపు టెన్నిస్‌ దిగ్గజం నోవాక్‌ జకోవిచ్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు నాలుగోసారి యూఎస్‌ ఓపెన్‌పై కన్నేశాడు. ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో అతడు వరుసగా మూడో రౌండ్‌లోనూ విజయం సాధించాడు. దీంతో సింగిల్స్‌ విభాగంలో ఇంకాస్త ముందుకు వెళ్లాడు. శుక్రవారం రాత్రి జర్మనీ ఆటగాడు జాన్‌ లెర్నడ్‌తో తలపడిన మ్యాచ్‌లో జకోవిచ్‌ 6-3, 6-3, 6-1తో పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. తన సర్వీసులతో ప్రత్యర్థిని ఏ మాత్రం కోలుకోనివ్వలేదు. ఈ విజయంతో వరుసగా 29 మ్యాచ్‌లు గెలుపొందాడు సెర్బియన్‌ స్టార్‌. అలాగే ఈ సీజన్‌లో 26-0 విజయాలతో దూసుకుపోతున్నాడు. జకోవిచ్‌ ఇప్పటికే 2011, 2015, 2018లో మూడుసార్లు ఈ కప్పును అందుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు పురుషుల డబుల్స్‌ విభాగంలో ఇండో కెనడియన్‌ జోడీ రోహన్‌ బోపన్న, డెనిస్‌ షాపొవాలో రెండో రౌండ్‌కు చేరుకుంది. వీరిద్దరూ అమెరికన్‌ జోడీ ఎర్నెస్టో, రూబిన్‌పై గెలుపొందారు. 6-2, 6-4 తేడాతో విజయం సాధించారు. ఇక మహిళల సింగిల్స్‌ విభాగంలో నంబర్‌ వన్‌ క్రీడాకారిణి అయిన జపాన్‌ స్టార్‌ నవోమి ఒసాకా నాలుగో రౌండ్‌కు చేరింది. శుక్రవారం ఉక్రెయిన్‌ స్టార్‌ మార్తా కోస్త్యుక్‌తో తలపడిన మూడో రౌండ్‌లో 6-3, 6-7 (4), 6-2 తేడాతో ఒసాకా విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు