IPL: ఆర్సీబీ.. ఆ నలుగురిని రిటెయిన్ చేసుకుంటుంది: ఆకాశ్ చోప్రా

వచ్చే ఏడాది జరుగనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విరాట్‌ కోహ్లి, యుజువేంద్ర చాహల్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌లతో పాటు హర్షల్..

Published : 24 Nov 2021 01:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వచ్చే ఏడాది జరుగనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విరాట్‌ కోహ్లి, యుజువేంద్ర చాహల్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌లతో పాటు హర్షల్ పటేల్‌, మహమ్మద్‌ సిరాజ్‌లలో ఒకరిని రిటెయిన్ చేసుకునే అవకాశం ఉందని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. అలాగే, ఆసీస్‌ ఆల్ రౌండర్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌తో పాటు మరికొంత మంది ఆటగాళ్లను బెంగళూరు జట్టు యాజమాన్యం వదులుకునే అవకాశం ఉందని అంచనా వేశాడు. 

‘ఆర్సీబీ జట్టు యాజమాన్యం విరాట్‌ కోహ్లి, యుజువేంద్ర చాహల్, మహమ్మద్‌ సిరాజ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌లను రిటెయిన్‌ చేసుకుంటుంది. జట్టు భవిష్యత్‌ అవసరాల రీత్యా చూస్తే మహమ్మద్‌ సిరాజ్‌ను.. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే హర్షల్ పటేల్‌ను తీసుకునే అవకాశం ఉంది. గత సీజన్‌లో హర్షల్‌ అద్భుతంగా రాణించాడు. అలాగే, ఆల్ రౌండర్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ రిటెయిన్ చేసుకోకపోవచ్చు. ఎందుకంటే,  ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నా.. భవిష్యత్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగించగలడా? అనే విషయంపై అనుమానాలున్నాయి. అందుకే అతడిని జట్టు యాజమాన్యం వేలంలో వదులుకునే అవకాశం ఉంది’ అని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. గత ఐపీఎల్ సీజన్‌ను బెంగళూరు జట్టు మూడో స్థానంతో ముగించింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్‌)తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓటమి పాలైన బెంగళూరు జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని