javelin throw: ఇకపై ఏటా ఆ రోజున జావెలిన్‌ త్రో పోటీలు: ఏఫ్ఐ

ఇకపై ఏటా ఆగస్టు 7న జాతీయ స్థాయి జావెలిన్‌ త్రో పోటీలు నిర్వహించనున్నట్టు అథ్లెటిక్స్‌ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా(ఏఎఫ్‌ఐ) వెల్లడించింది.

Published : 10 Aug 2021 23:43 IST

దిల్లీ: ఇకపై ఏటా ఆగస్టు 7న జాతీయ స్థాయి జావెలిన్‌ త్రో పోటీలు నిర్వహించనున్నట్టు అథ్లెటిక్స్‌ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా(ఏఎఫ్‌ఐ) వెల్లడించింది. జావెలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటి అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే నీరజ్‌ విజయానికి గుర్తుగా అతడు పతకం సాధించిన ఆగస్టు 7న.. ఏటా జావెలిన్ త్రో పోటీలు నిర్వహించేందుకు నిర్ణయించినట్టు ఏఎఫ్‌ఐ ప్లానింగ్‌ కమిటీ ఛైర్మన్‌ లలిత్‌ భానోత్‌ మంగళవారం తెలిపారు. ఈ క్రీడలో మరింత మందిని ప్రోత్సహించడంలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

అథ్లెటిక్స్‌లో బంగారు పతకం కోసం భారత్‌ సుదీర్ఘ నిరీక్షణకు జావెలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా ఈ నెల 7న తెరదించాడు. ఫైనల్‌ పోరులో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి అతడు పసిడి పతకాన్ని ముద్దాడాడు. నీరజ్‌ కన్నా ముందు ఒలింపిక్స్‌లో వ్యక్తిగతంగా బంగారు పతకం సాధించిన క్రీడాకారుడు అభినవ్‌ బింద్రా మాత్రమే. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఆయన ఈ ఘనత సాధించాడు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని