IND vs NZ: రహానె.. ఫామ్‌ అందుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు : పుజారా

గత కొద్ది కాలంగా ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న అజింక్య రహానెకు.. ‘నయావాల్’ ఛెతేశ్వర్‌ పుజారా అండగా నిలిచాడు. రహానె గొప్ప ప్లేయర్ అని, అతడు మునుపటి ఫామ్‌ అందుకునేందుకు ఒక్క ఇన్నింగ్స్‌..

Published : 23 Nov 2021 18:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్: గత కొద్ది కాలంగా ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న అజింక్య రహానెకు.. ‘నయావాల్’ ఛెతేశ్వర్‌ పుజారా అండగా నిలిచాడు. రహానె గొప్ప ప్లేయర్ అని, అతడు మునుపటి ఫామ్‌ అందుకునేందుకు ఒక్క ఇన్నింగ్స్‌ చాలని పేర్కొన్నాడు. త్వరలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్ట్‌ సిరీస్‌లో అతడు సత్తా చాటుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

‘ప్రతి ఒక్క ఆటగాడి కెరీర్లో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమే. రహానె గొప్ప ఆటగాడు. అతడు మునుపటి ఫామ్‌ను అందుకుని.. బ్యాటింగ్‌లో సత్తా చాటేందుకు ఒక్క ఇన్నింగ్స్ చాలు. న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో అతడు మెరుగ్గా రాణిస్తాడనుకుంటున్నా’ అని పుజారా అన్నాడు. మరోవైపు.. టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ కూడా అజింక్య రహానె ఫామ్‌పై స్పందించాడు. టెస్టుల్లో రహానె వరుసగా విఫలమవుతున్నా.. అతడిపై నమ్మకంతో తుదిజట్టులో చోటు కల్పించడం, కాన్పుర్‌లో జరుగనున్న తొలి టెస్టుకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం అతడి అదృష్టమని గంభీర్ అన్నాడు. ఈసారి అయినా అతడు భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని ఆశిస్తున్నానన్నాడు. తొలి టెస్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దూరం కావడంతో.. అజింక్య రహానె కెప్టెన్‌గా, ఛెతేశ్వర్‌ పుజారా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది యువ ఆటగాళ్లు టీమ్‌ఇండియా తరఫున టెస్టు క్రికెట్లో స్థానం కోసం ఎదురు చూస్తుండటంతో.. తొలి టెస్టులో రహానె విఫలమైతే.. అతడి కెరీర్‌ ప్రమాదంలో పడినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని