అక్షర్‌.. నీ కళ్లద్దాలు ఎక్కడదొరుకుతాయ్‌

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా వర్తమాన వ్యవహారాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో

Published : 06 Mar 2021 18:30 IST

ఆనంద్‌ మహీంద్రా ట్వీట్

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా వర్తమాన వ్యవహారాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా ఘన విజయం సాధించడంపై అభినందనలు తెలిపిన ఆయన.. ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. మ్యాచ్‌లో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ పెట్టుకున్న సన్‌ గ్లాసెస్‌ చూసి ముచ్చటపడిన మహీంద్రా.. అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పాలని కోరారు. 

‘‘ఓకే.. దుమ్ములేపారు. సిరీస్‌ను జేబులో వేసుకున్నారు. అభినందనలు. ఇప్పుడు ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు నాకు ఈ చలువ కళ్లద్దాలు(అక్షర్‌ పెట్టుకున్నవి) కావాలి. అవి ఏ బ్రాండ్‌? ఎక్కడ దొరుకుతాయ్‌?’’అని మహీంద్రా ట్వీట్‌ చేశారు. 

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచి 3-1తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవడమేగాక, ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో అక్షర్‌ మరోసారి ఐదు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో 11 వికెట్లు పడగొట్టి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని