T20 World Cup: నీషమ్‌ ఔటై ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో.!

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కివీస్‌ విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్లో తొలిసారి ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది.

Updated : 25 Oct 2022 11:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కివీస్‌ విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్లో తొలిసారి ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్‌ జట్టుపై గెలుపొందింది. 

ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్ జట్టు.. ఆ తర్వాత గొప్పగా పుంజుకుంది. చివరి నాలుగు ఓవర్లలో న్యూజిలాండ్‌ విజయానికి 57 పరుగులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అప్పటికీ ఇంగ్లాండ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రిస్‌ జోర్డాన్ వేసిన 17వ ఓవర్లో జిమ్మీ నీషమ్‌ (27) చెలరేగిపోయాడు. రెండు సిక్సులు, ఓ ఫోర్‌తో విధ్వంసం సృష్టించడంతో ఫలితం మారిపోయింది. తొలి బంతికి సిక్స్ బాదిన నీషమ్‌, మూడో బంతిని ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతికే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద ఉన్న జానీ బెయిర్‌ స్టోకి చిక్కాడు. అయితే, బంతిని చేతుల్లోకి తీసుకొనే క్రమంలో అతడు బౌండరీ లైన్‌ను తాకడంతో..  నాటౌట్‌గా అంపైర్‌ ప్రకటించాడు. దీంతో ఆ ఓవర్లో నీషమ్‌ రెండు సిక్సులు, ఓ ఫోర్‌ సహా మొత్తం 23 పరుగులు రాబట్టాడు. దీంతో న్యూజిలాండ్‌ జట్టులో ఫైనల్‌పై ఆశలు చిగురించాయి. ఆ తర్వాతి ఓవర్లో నీషమ్‌ ఔటైనా.. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ డెరిల్‌ మిచెల్ (72) జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. ఆ ఓవర్లో నీషమ్‌ ఔటై ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో.! ఆ కీలక ఓవర్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ తన అధికారిక ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంది. మీరూ చూసేయండి..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని