Bangalore : మొన్న ఆటగాళ్ల మద్దతు.. నేడు ఇంకో అడుగు ముందుకేసిన బెంగళూరు యాజమాన్యం

 ఇవాళ ముంబయి, దిల్లీ జట్ల మధ్య కీలక మ్యాచ్‌ జరగనుంది. ముంబయికి పెద్దగా ఉపయోగం లేకపోయినా దిల్లీ చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ మ్యాచ్‌...

Published : 21 May 2022 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇవాళ ముంబయి, దిల్లీ జట్ల మధ్య కీలక మ్యాచ్‌ జరగనుంది. ముంబయికి పెద్దగా ఉపయోగం లేకపోయినా దిల్లీకి చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ మ్యాచ్‌ ఫలితంతోనే బెంగళూరు ప్లేఆఫ్స్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. తమ జట్టు సభ్యులందరూ ముంబయికే మద్దతు ప్రకటిస్తున్నామని ఇప్పటికే ఆ జట్టు సారథి డుప్లెసిస్‌తోపాటు టాప్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ వెల్లడించిన విషయం తెలిసిందే. గుజరాత్‌పై విజయం సాధించిన అంనంతరం డుప్లెసిస్‌, కోహ్లీ మాట్లాడారు. ఈ క్రమంలో నేడు బెంగళూరు యాజమాన్యం ఏకంగా తమ ట్విటర్ ప్రొఫైల్‌ పిక్‌నే మార్చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో నీలం రంగు వచ్చేలా డిజైన్‌ చేసింది. గతంలో ఎర్ర రంగు ఉండే స్థానంలో బ్లూ కలర్‌తో నింపేసింది. 

ఇప్పటికే గుజరాత్ (20), రాజస్థాన్‌ (18), లఖ్‌నవూ తొలి మూడు స్థానాలతో ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఇక మిగిలింది ఆఖరి బెర్తు మాత్రమే. దీని కోసం బెంగళూరు (16, -0.253 నెట్‌రన్‌రేట్), దిల్లీ రేసులో మిగిలాయి. దిల్లీ 13 మ్యాచుల్లో ఏడు విజయాలు సాధించి 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇవాళ ముంబయిపై విజయం సాధిస్తే మెరుగైన రన్‌రేట్‌తో దిల్లీ నాలుగో స్థానం కైవసం చేసుకుంటుంది. బెంగళూరు ఇంటిముఖం పడుతుంది. దిల్లీ ఓడితే మాత్రం బెంగళూరు ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోతుంది. లీగ్ దశలో ఇది 69వ మ్యాచ్‌. ఇక రేపు హైదరాబాద్‌, పంజాబ్‌ జట్ల మధ్య ఆఖరి లీగ్‌ (70) మ్యాచ్‌ ఉన్నప్పటికీ అది నామమాత్రమే అవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని