Women’s T20 Challenge : మహిళల టీ20 ఛాలెంజ్‌.. మూడు జట్లకు కెప్టెన్లు ఎవరంటే..?

 పురుషుల టీ20 లీగ్ తుది దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో మహిళల టీ20 ఛాలెంజ్‌ నిర్వహణకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను...

Published : 17 May 2022 01:42 IST

ముంబయి: పురుషుల టీ20 లీగ్ తుది దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో మహిళల టీ20 ఛాలెంజ్‌ నిర్వహణకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మూడు జట్లు మే 23 నుంచి 28 వరకు తలపడతాయి. హర్మన్‌ ప్రీత్‌ కౌర్ (సూపర్‌ నోవాస్‌), స్మృతీ మంధాన (ట్రయల్‌బ్లేజర్స్‌), దీప్తి శర్మ (వెలాసిటీ) నాయకత్వంలోని మూడు టీమ్‌లను బీసీసీఐ ప్రకటించింది. వెలాసిటీ జట్టుకు గత సీజన్‌ వరకు మిథాలీరాజ్‌ కెప్టెన్‌గా ఉండేది. అయితే ఈసారి మాత్రం దీప్తిశర్మను సారథిగా నియమించింది. ‘‘అత్యుత్తమ మహిళల క్రికెట్‌ ఛాలెంజ్‌లో భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జట్ల నుంచి ప్లేయర్లు ఆడతారు. మొత్తం 12  మంది అంతర్జాతీయ క్రీడాకారిణులు మహిళల టీ20 లీగ్‌ ఛాలెంజ్‌లో పోటీపడతారు’’ అని బీసీసీఐ వెల్లడించింది.  

ప్రతి జట్టులో 16 మంది సభ్యులు ఉంటారు. మహిళల టీ20 ఛాలెంజ్‌ ఆరంభ మ్యాచ్‌ ట్రయల్‌బ్లేజర్స్‌, సూపర్‌నోవాస్‌ జట్ల మధ్య మే 23న ప్రారంభమవుతుంది. అన్ని మ్యాచ్‌లూ పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా జరుగుతాయి. మే 24న సూపర్‌నోవాస్-వెలాసిటీ, మే 26న వెలాసిటీ-ట్రయల్‌బ్లేజర్స్‌ మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్‌ మ్యాచ్‌ మే 28న బీసీసీఐ నిర్వహించనుంది. 

జట్ల వివరాలు: 

సూపర్‌ నోవాస్‌ : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), తానియా భట్, అలానా కింగ్‌, ఆయుషి సోని, చందు వి, డీంద్ర డాటిన్, హర్లీన్‌ డియోల్, మేఘ్న సింగ్, మోనిక పటేల్, ముస్కాన్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రియా పూనియా, రాశి కనోజియా, సోఫీ ఎక్లేస్టోన్‌, సునే లూస్, మాన్సి జోషి

ట్రయల్‌బ్లేజర్స్‌ : స్మృతీ మంధాన (కెప్టెన్‌), పూనమ్ యాదవ్, అరుంథతి రెడ్డి, హేలీ మ్యాథ్యూస్, జేమీ రోడ్రిగ్స్‌, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్, రేణుక సింగ్, రిచా ఘోష్, ఎస్‌ మేఘన, సాయిఖ్ ఇషాక్, సల్మా ఖాతున్, షర్మిన్ అక్తర్‌, సోఫీ బ్రోన్, సుజాత మల్లిక్, ఎస్‌బీ పోఖర్కర్ 

వెలాసిటీ : దీప్తి శర్మ (కెప్టెన్), స్నేహ్‌ రాణా, షఫాలీ వర్మ, ఖాకా, కేపీ నవ్‌గిరే, క్రాస్, కీర్తి జేమ్స్, లారా వాల్వార్త్‌, మాయా సోనావానే, నాథకన్‌ ఛాతమ్, రాధా యాదవ్, ఆర్తి కేదార్, శివాలీ షిండే, సిమ్రన్ బహదుర్, యస్తికా భాటియా, ప్రణవి చంద్ర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని