Published : 13/11/2021 01:11 IST

Rohit Sharma: వన్డే కెప్టెన్‌గానూ రోహిత్‌ శర్మ?

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ అనంతరం పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటానని విరాట్‌ కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్‌ శర్మని ప్రకటించింది బీసీసీఐ. న్యూజిలాండ్‌తో నవంబరు 17 నుంచి ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌కు టీమిండియా రోహిత్‌ సారథ్యంలోనే బరిలోకి దిగనుంది. ఇక, టీ20 కెప్టెన్‌గా కోహ్లీ తప్పుకున్నా.. వన్డేలు, టెస్టుల్లో మాత్రం అతడి కెప్టెన్సీకి ఢోకా లేదని అందరూ భావించారు. అయితే, వన్డేల్లో కూడా కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను ప్రస్తుత టీ20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. విరాట్‌కు కెప్టెన్సీ భారం తగ్గించి అతడు బ్యాటింగ్‌పై దృష్టిపెట్టేందుకే బీసీసీఐ ఈ ఆలోచన చేస్తోందట.

‘‘భారత జట్టు వన్డే కెప్టెన్‌గా కోహ్లీ భవిష్యత్తుపై చర్చలు జరపాలని బీసీసీఐ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీ కెప్టెన్సీ భారం నుంచి ఉపశమనం పొందాలని బోర్డు కోరుటోంది. దీంతో అతడు తన బ్యాటింగ్‌పై దృష్టి సారించి మునుపటి ఫామ్‌ని తిరిగి అందుకోవచ్చు’’ అని బీసీసీఐకి చెందిన ఒక అధికారి చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని బీసీసీఐ కోరనుందట. వన్డేల్లో రోహిత్‌ను కెప్టెన్‌గా చేస్తే కేఎల్‌ రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని సమాచారం.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని