Tokyo Paralympics: చరిత్ర సృష్టించిన భవినాబెన్‌.. పతకం ఖాయం చేసుకున్న తొలి ప్యాడ్లర్‌

భారత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి చరిత్ర సృష్టించింది. పారాలంపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో సెమీస్‌కు చేరిన మొట్టమొదటి భారత ప్యాడ్లర్‌గా రికార్డు నెలకొల్పింది.....

Published : 28 Aug 2021 02:15 IST

టోక్యో: భారత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భవినాబెన్‌ చరిత్ర సృష్టించింది. పారాలంపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో సెమీస్‌కు చేరిన మొట్టమొదటి భారత ప్యాడ్లర్‌గా రికార్డు నెలకొల్పింది. ఇది మాత్రమే కాదు టోక్యో పారాలింపిక్స్‌లో పతకాన్ని ఖాయం చేసుకున్న మొట్టమొదటి భారత క్రీడాకారిణిగానూ భవినాబెన్‌ పటేల్‌ నిలిచింది. మొదటి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ విశేషంగా పుంజుకున్న భవినాబెన్‌ వరుస విజయాలతో దూసుకెళ్లింది. అదే ఊపుతో క్వార్టర్స్‌లో ఆమె 11-5, 11-6, 11-7 వరుస గేముల్లో సెర్బియాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ బొరిస్‌లవ పెరిక్‌ రంకోవిచ్‌ను మట్టికరిపించింది. 18 నిమిషాల్లోనే ఈ ఆటను ముగించడం విశేషం. శనివారం జరిగే సెమీస్‌ పోరులో ఆమె చైనా ప్లేయర్‌ ఝాంగ్‌ మియావ్‌తో తలపడనుంది. సెమీస్‌లో ఓడినా భవినాబెన్‌కు కాంస్య పతకం లభిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని